AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Assembly: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!.. ఈసారి ఒకట్రెండు రోజులు మాత్రమేనా?

Andhra Pradesh Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సమావేశాలను ఒకటి రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని

Andhra Pradesh Assembly: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!.. ఈసారి ఒకట్రెండు రోజులు మాత్రమేనా?
Ap Assembly
Shiva Prajapati
|

Updated on: Nov 13, 2021 | 8:47 AM

Share

Andhra Pradesh Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సమావేశాలను ఒకటి రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీ లోపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, వచ్చే నెలలో పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 19 కి అసెంబ్లీ సమావేశాలు జరిగి ఆరు నెలలు పూర్తవుతుంది. ఈ లోగా సమావేశాల నిర్వహణ తప్పనిసరి. అందుకే 18వ తేదీన సభ ఒక్కరోజు జరపడమా? లేక రెండు రోజులు జరపాలా? అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇక వచ్చే నెలలో ఐదారు రోజులు సభ జరపాలనుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటాతో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే లు వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కోసం సభ జరపాల్సి ఉంటుంది కాబట్టి.. అదే సమయంలో ఐదారు రోజులు ఉభయసభలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. డిసెంబర్‌లో సమావేశాలతో మండలిలో వైసీపీ పూర్తి ఆధిక్యం సాదించనుంది.

Also read:

Retail Sales: రిటైల్ అమ్మకాల జోరు..దేశ ఆర్ధిక వ్యవస్థలో మెరుగుదల.. సేల్స్ ఎంత పెరిగాయంటే..

Cyber Attack: కంపెనీ అకౌంట్‌పై సైబర్‌ ఎటాక్‌.. అరగంటలోనే రూ. 1.28 కోట్లు కొల్లగొట్టారు..

Snake and Lizard Fight Video: పాము, ఉడుము ఫైట్‌.. గెలుపెవరిదో చూడాల్సిందే నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..