Snake and Lizard Fight Video: పాము, ఉడుము ఫైట్‌.. గెలుపెవరిదో చూడాల్సిందే నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Snake and Lizard Fight Video: పాము, ఉడుము ఫైట్‌.. గెలుపెవరిదో చూడాల్సిందే నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 15, 2021 | 8:19 AM

సాధారణంగా నాగుపాముని దూరం నుంచి చూస్తేనే జనాలకు భయంతో వణుకు పుడుతుంది. అలాంటిది ఈ కోబ్రా వేటాడుతుండగా చూస్తే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు.! తాజాగా సోషల్ మీడియాలో నాగుపాము వేటకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా నాగుపాముని దూరం నుంచి చూస్తేనే జనాలకు భయంతో వణుకు పుడుతుంది. అలాంటిది ఈ కోబ్రా వేటాడుతుండగా చూస్తే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు.! తాజాగా సోషల్ మీడియాలో నాగుపాము వేటకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో జరిగింది.. అయితే ఈ నాగుపాము దేనిని వేటాడిందో.. ఏంటో మనమూ చూసేద్దామా…

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక నిర్జన ప్రదేశంలో అనూహ్యంగా ఓ నాగుపాముకి ఉడుము చిక్కింది. ఆ ఉడుము పాము నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే లాభం లేకుండా పోయింది. నాగుపాము ఉడుమును చుట్టేసి అమాంతం మింగేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికీ లక్షలమంది వీక్షిస్తూ.. లైక్‌ చేస్తున్నారు. పాము, ఉడుము ఫైట్‌పైన రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి ఉడుము చాలా బలమైనది… అందుకే ఎవరైనా ఏవిషయంలోనైనా పట్టు వదలకుండా ఉంటే.. వీడిది ఉడుం పట్టురా బాబు… అంటారు.. కానీ పాపం ఏం చేస్తాం.. అంతటి బలమైన ఉడుం కూడా చలి చీమల చేతిలో పాము బలైనట్లు ఉడుము ఈ కోబ్రాకు బలైపోయింది. 
మరిన్ని చూడండి ఇక్కడ:
Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 08:07 AM