AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాత్రికి రాత్రే ఇళ్లకు బీటలు.. ఏపీలోని ఆ ఊరు కనుమరుగవుతుందా..? భయం గుప్పిట్లో జనం..

ఆ ఊళ్లో నిజంగా భూమి కంపించిందా? రాత్రికి రాత్రి ఇళ్లకు బీటలు ఎలా పడ్డాయి? గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది ఎవరు? జోషిమఠ్‌ తరహా ప్రమాదం ఆ ఊరికి పొంచి ఉందా? ఆ ఊళ్లో ఇక జనవాసం సాధ్యం కాదా?

Andhra Pradesh: రాత్రికి రాత్రే ఇళ్లకు బీటలు.. ఏపీలోని ఆ ఊరు కనుమరుగవుతుందా..? భయం గుప్పిట్లో జనం..
Representative Image
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2023 | 8:47 AM

Share

భూకంపం – ఈ మాట వింటే పై ప్రాణాలే పైనే పోతాయి. ఈ మధ్య టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో చూశాం. ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో తరచూ భూమి కంపిస్తుండటం, జనాలు భయాందోళనలకు గురవుతుండటం చూస్తునే ఉన్నాం. తాజాగా కర్నూలు జిల్లాలోనూ భూకంపించింది. ఆ ప్రకంపనలకు ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయి. ఈ పగుళ్లు ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని జోషిమఠ్‌లోని పగుళ్లను తలపిస్తున్నాయి. జోషిమఠ్‌లో పగుళ్లు, ఆ పట్టణ వాసుల ఆందోళనలపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ పగుళ్లు ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. టీవీ9లో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఆ పట్టణవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పగుళ్లకు కారణాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామం ఇది. ఈ గ్రామంలో నిన్న రాత్రి భూమి కంపించిందని గ్రామస్తులు అంటున్నారు. ఏ స్థాయిలో ఆ ప్రకంపనలు వచ్చాయో రిక్టర్‌ స్కేల్‌పై నమోదు కాలేదు. గ్రామస్తులు కూడా ఆ భూకంపాన్ని గుర్తించినట్టు లేదు. కాని, చూసేసరికి ఊళ్లలోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఒకటి రెండు కాదు 13 ఇళ్లు పగుళ్లిచ్చాయి. గ్రామంలో కొన్ని చోట్ల రోడ్లు కూడా కుంగిపోయాయి. ఇళ్లు ఎక్కడా కూలిపోతాయోననే భయంతో నిన్న రాత్రంతా ఈ ఇళ్ల వాళ్లంతా జాగారమే చేశారు. ఈ ఇళ్లన్నీ కొత్తగా కట్టుకున్నవే. ఊళ్లు దాదాపు 60 మీటర్ల పరిధిలోనే ఇళ్లలో ఈ పగుళ్లు కనిపించాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గ్రామానికి చేరుకొని ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ఈ గ్రామాన్ని గతేడాది దత్తత తీసుకున్నారు. ఇళ్లు బీటలు వారాయని తెలియగానే ఆయన కూడా గ్రామాన్ని సందర్శించారు. బీటలు వారిన ఇంటి యజమానులను రెండు రోజులు బయట ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

అందరూ వచ్చి చూసి వెళ్లారు గాని తమకు ఎవరూ భరోసా ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇళ్లు బీటలు బారడానికి కారణమేంటో త్వరగా గుర్తించాలని కోరుతున్నారు. అదే సమయంలో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ రాతన గ్రామంలో భూకంపం వచ్చిందా? ఇళ్లు ఉన్నట్టుండి ఎందుకు బీటలువారాయి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..