Andhra Pradesh: ఏపీలో పొలిటికల్‌ హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. సై అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్ పెంచుతున్నాయి. ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Andhra Pradesh: ఏపీలో పొలిటికల్‌ హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. సై అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
Mlc Election
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 08, 2023 | 9:14 AM

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్ పెంచుతున్నాయి. ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండుమూడు ఉమ్మడి జిల్లాల మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఎన్నికల ఫీవర్‌ ఉంది. ఈ ఎన్నికలు 2024 ఎన్నికలకు సెమీఫైనల్స్‌లా పార్టీలకు మారాయి. సోషల్‌ ఇంజినీరింగ్‌ నుంచి ఎలక్షనీరింగ్‌ వరకూ పక్కాగా చేస్తున్నారు. మూడు రాజధానుల నుంచి ఉద్యోగుల సమస్యల వరకూ అన్నీ ఎన్నికల ప్రచారంలో అజెండా మారాయి. అయితే, ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు కురిపించడంతోపాటు.. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోయాయి.

ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 స్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాల స్థానాలతో పాటు మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. 16న కౌంటింగ్‌ ఉంటుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇస్తున్న పీడీఎఫ్‌లు బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారింది. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు అధికార, విపక్ష పార్టీలు విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నాయి. పోలింగ్‌కు టైం దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తున్న వైసీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్‌కు పట్టుభద్రుల స్థానం గెలిచి కానుకగా ఇవ్వాలంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. అటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రచారం చేస్తున్న YCPనేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సోపానం కావాలంటూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోంది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అర్హత లేనివాళ్లకు కూడా ఓటర్ల లిస్టులో చేర్పించారన్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. వాలంటీర్లు దగ్గరుండి దొంగ ఓట్లు చేర్పించారని ఎన్నికల సంఘం కళ్లప్పగించి చూస్తోందన్నారు టీడీపీ నేతలు. పెద్దల సభను అపహస్యం చేసేలా వైసీపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు సీపీఐ నేత రామకృష్ణ.. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వీప్‌ చేసి విపక్షాలు అంటున్న ప్రభుత్వ వ్యతిరేకత ఉట్టిమాటే అని చాటాలనుకుంటోంది వైసీపీ. అటు తమ సత్తా చాటి.. వచ్చే ఎన్నికలకు కేడర్‌లో భరోసా నింపాలనుకుంటున్నాయి విపక్షాలు. మరి పట్టభద్రులు, ఉద్యోగుల మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..