Andhra Pradesh: గుంటూరు రైల్వే స్టేషన్‌లో సాధువు.. కొంచెం తేడా కొట్టడంతో చెక్ అధికారులకు మైండ్ బ్లాంక్..
అది రద్దీగా ఉండే రైల్వే స్టేషన్.. వచ్చి పోయే రైళ్లతో.. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అలాంటి రైల్వే స్తేషన్‌లో సాధువు డ్రెస్‌లో ఓ వ్యక్తి అటు.. ఇటు తిరుగుతూ కనిపిస్తున్నాడు..

అది రద్దీగా ఉండే రైల్వే స్టేషన్.. వచ్చి పోయే రైళ్లతో.. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అలాంటి రైల్వే స్తేషన్‌లో సాధువు డ్రెస్‌లో ఓ వ్యక్తి అటు.. ఇటు తిరుగుతూ కనిపిస్తున్నాడు.. అక్కడ అతని కోసం వచ్చిన వారిని మాత్రమే కలుస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అతని.. కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంకెముంది.. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు అతను చేసే పని ఏంటోనంటూ లుక్కెశారు. అయితే.. పైకి సాధువులా కనిపిస్తున్నా.. అతను చేసే పనులు చూసి పోలీసులే బిత్తరపోయారు. రైల్వేస్టేషన్‌లో గంజాయ్ అమ్ముతుండంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన గుంటూరు పట్టణంలో చోటుచేసుకుంది.
గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న సాధువు అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. ఒడిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చిన అతను.. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయ్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సాధువు కదలికలపై నిఘా ఉంచి.. గంజాయ్ అమ్ముతుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసినట్లు కొత్తపేట పోలీసులు వెల్లడించారు. అతని దగ్గరినుంచి కేజీ 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Guntur Police
అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. అతను ఒక్కడేనా.. వెనుక ఏమైనా ముఠా దాగున్నదా..? అనే వివరాలను సేకరిస్తున్నారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం..