AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ లో జూనియర్‌ డాకర్టకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను..

Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం..
Andhra Pradesh Jr. Doctors
Amarnadh Daneti
|

Updated on: Oct 21, 2022 | 10:50 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ లో జూనియర్‌ డాకర్టకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్‌లో పెంపుదల ఉంటుందని వెల్లడించింది. గత కొద్ది రోజులుగా తమకు ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్ సరిపోవడం లేదని, స్టైఫండ్ పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ డాక్టర్లకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చిన ప్రభుత్వం తాజాగా జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44,075 నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524 నుంచి రూ.53,503కు, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు పెంచింది. స్టైఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ధన్యవాదాలు తెలిపారు.

వాస్తవానికి తమ న్యాయమైన కోర్కెను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తాము సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 26న ఓపీ సేవలు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ సమ్మె నోటీసులను ఇచ్చారు. తమ స్టైఫండ్‌ 42 శాతం పెంచాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. అయితే తాము కోరిన కోర్కె పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో.. జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగాలని నిర్ణయించారు.

ఈ నెల 26వ తేదీ నుంచి ఓపీ సేవలను నిలిపివేయనున్నామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. అప్పటిలోగా తమ న్యాయమైన కోర్కెను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే అయితే సమ్మెకు దిగాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. అవసరమైతే అక్టోబర్ 27 నుంచి వార్డులు, నాన్‌ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ నెల 27 నుంచి అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను కొనసాగించబోమని పేర్కొన్నారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూనియర్ వైద్యులు ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. జూనియర్ వైద్యుల సమ్మె నిర్ణయంతో ప్రభుత్వం వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించింది. వారి స్టైఫండ్ ను పెంచాలని నిర్ణయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..