Tourism: పర్యాటక ప్రియులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణను కలుపుతూ ఐకానిక్ వండర్ బ్రిడ్జ్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా మారిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లీ కలవబోతున్నాయి.

Tourism: పర్యాటక ప్రియులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణను కలుపుతూ ఐకానిక్ వండర్ బ్రిడ్జ్..
Iconic Cable Bridge
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 21, 2022 | 9:04 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా మారిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లీ కలవబోతున్నాయి. అవును, ప్రపంచంలోనే రెండో ఐకానిక్‌ వండర్‌ వాటిని కలపబోతోంది. సోమశిల వేదికగా రంగం సిద్ధమైంది. ఇంకెందుకాలస్యం. తొందరగా కొబ్బరికాయ కొట్టెయ్యండి బాస్‌ అంటున్నారు జనం.

గలగలా పారే కృష్టమ్మ.. నదికి రక్షణలా చుట్టూ కొండలు, అడవులతో పచ్చగా పరుచుకున్న నల్లమల అడవులు. అడవి మధ్యలో పారే కృష్ణా నది. ఈ అందాలను చూడడానికి రెండు కళ్లూ చాలవు. చుట్టూ ఆకుపచ్చ తివాచీ పరిచినట్టు దట్టంగా అల్లుకున్న నల్లమల, మధ్యలో పాములా మెలికలు తిరుగుతూ పారే కృష్ణమ్మ.. బోటులో షికారు కెళితే.. హుషారు తెప్పించే ఆ సీనరీకి అదిరిపోయే సాంగ్‌ వేస్కోవాల్సిందే. పర్యాకులు ప్యార్‌ మే పడిపోయామే అనుకుంటారు. అలాంటి చోట ఇలాంటి గ్లాస్‌ వాక్‌వే ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

అందమైన దృశ్యాలు.. అహ్లాదకరమైన వాతావరణం.. పర్యాటకులను ఇట్టే కట్టి పడేసే కొండలు, గుట్టలు.. ఇదంతా గలగలా పారే కృష్ణమ్మ సొంతం. అలాంటి కృష్ణాతీరం మరింత పర్యాటక శోభను సొంతం చేసుకోబోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతమంతా అద్భుతంగా మారబోతోంది. సోమశిల వద్ద నిర్మించనున్న అతి పెద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారధికి మార్గం సుగమమైంది. సుంద‌ర సోమ‌శిల అందాల‌ను మ‌రింత పెంచేలా ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతోంది. అభివృద్ది చెందిన దేశాల్లోనే కనిపించే చరిత్రాత్మక వంతెనకు కేంద్రం బీజం వేసింది. ఈ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జితో పాటు గాజు వంతెన రానుంది. ఈ గ్లాస్ వాక్‌వేలో నడుస్తుంటే.. కింద కృష్ణా నది అందాలతో పాటు నల్లమల అడవులు, ఎత్తైన పర్వతాలు, శ్రీశైలం బ్యాక్ వాటర్ ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నాయి. 1082.50 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఆరు వందల మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ లో 600 కోట్ల రూపాయలు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల-సిద్ధేశ్వరం వద్ద అధునాతన ఐకానిక్ అంటే తీగల వంతెన ఏర్పాటు కు నివేదిక ఇవ్వడంతో డిపిఆర్ కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐకానిక్‌ వారధి రానుండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య దూరం తగ్గడంతో పాటు అనేక ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు స్థానికులు. పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు.

చక్కటి వాతావరణం, అందమైన దృశ్యాలు ఉండడం వల్ల ప్రైవేటు ఆల్బమ్ షూట్ చేసేందుకు వచ్చామని, బ్రిడ్జ్‌ నిర్మాణం తర్వాత పర్యాటకుల సంఖ్యకూడా విపరీతంగా పెరుగుతుందంటున్నారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు.

కలగా మిగిలిన ఐకానిక్‌ బ్రిడ్జిని సాకారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కృష్ణానదికి అటువైపున ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ప్రతి రోజు అటు నించి ఇటు నాటు పడవల ద్వారా రాకపోకలు జరుపుతూ ఉంటారు. మంచాలకట్ట వద్ద కృష్ణానది దాటుతూ 2007లో నాటు పడవ మునిగి 62 మంది జలసమాధి అయ్యారు. నాటి నుంచి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన సాగుతోంది. సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్ రోడ్డు లో శిలాఫలకం వేశారు. అప్పట్లో బిఓటి పద్ధతిన నిర్మించేందుకు 93 కోట్ల రూపాయలు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో పనులు నిలిచిపోయాయి. సిఎం కెసిఆర్ కృషి వల్ల. స్థానిక ఎంఎల్ఎ హర్షవర్ధన్ రెడ్డి చొరవతో బ్రిడ్జి మంజూరైందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

తెలంగాణాలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటే పడవలో ప్రమాదకర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోడ్డు మార్గాన వెళ్లాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవాళ్లుత కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే రెండు అతిపెద్ద తీగల వంతెనగా, దేశంలోనే మొదటి అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా చరిత్రలో నిలిచిపోనుంది. తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపు సంగమేశ్వర ఆలయం ఉంటాయి. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం నీరు, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో రమణీయ ప్రకృతి ఆకట్టుకుంటుంది.

మరిన్ని తెలంగాణ&ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..