AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonda uma: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా.? ఆసక్తిగా మారిన బొండా ఉమా వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, అందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా సరికొత్త చర్చకు తెర తీశారు. రాష్ట్రంలో కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేకే, జగన్‌ మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు..

Bonda uma: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా.? ఆసక్తిగా మారిన బొండా ఉమా వ్యాఖ్యలు..
TDP politburo member bonda uma
Narender Vaitla
|

Updated on: Oct 22, 2022 | 6:15 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, అందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా సరికొత్త చర్చకు తెర తీశారు. రాష్ట్రంలో కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేకే, జగన్‌ మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని బొండా ఉమా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై ఇప్పటికే సంకేతాలిస్తున్నారి ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీడీపీ సర్వసన్నద్ధంగా ఉందని బొండా ఉమ ధీమా వ్యక్తం చేశారు.

ఇక వైసీపీపై ఫైర్‌ అయిన ఉమా.. ‘ఎన్నికల్లో గెలవడంకోసం 2019లో జగన్ కుప్పలుతెప్పల హామీలిచ్చాడు. 2.30లక్షల ఉద్యోగాలభర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, పోలీస్ శాఖలోని ఖాళీలభర్తీ, వీక్లీఆఫ్ లు అన్న జగన్, మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? ఉపాధిలేక, కుటుంబం ముందు తిరగలేక రాష్ట్ర యువత సిగ్గుతో చచ్చిపోతోంది. ఉద్యోగాలు లేవన్న మనోవేదనతో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ వైఫల్యంకాదా? టీడీపీప్రభుత్వంలో 2సార్లు డీఎస్సీ నిర్వహించి, 25వేలకు పైగా ఉపాధ్యాయపోస్టులు భర్తీ చేశామని’ తెలిపారు.

గతంలోనూ వార్తలు..

ఇదిలా ఉంటే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఏపీలో జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికల్లో వైసీపీ సంచనల విజయం నమోదు చేయడం, చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ జెండా ఎగరడంతో ముందస్తు ఎన్నికలకు బీజం పడినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో సంక్షేమ పథాకాల అమలు తీరును ప్రజలు వివరించే కార్యక్రమాన్ని చేపట్టారని ఏ క్షణంలోనైనా ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలకు బలం చేకూరింది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ భేటీ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే జరిగిందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. మరి ఏపీలో ముందస్తు ఎన్నికలు నిజంగానే జరుగుతాయా.? లేదా చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..