Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్యం నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..
Konaseema: జిల్లా పేరును డాక్టర్ BR అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అమలాపురం హెడ్ క్వార్టర్స్‌గా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా పేరును డాక్టర్ BR అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అమలాపురం హెడ్ క్వార్టర్స్‌గా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లా పేరు మార్పునకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం పేరు ఖరారు చేస్తుంది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.