Andhra Pradesh: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయంలో కీలక నిర్ణయం.. అప్డేటెడ్ జీవో జారీ చేసిన ఏపీ సర్కార్..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. గతంలో తీసుకువచ్చిన రూల్స్‌లో మరికొన్ని మార్పులు చేస్తే ఆప్‌డేటెడ్..

Andhra Pradesh: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయంలో కీలక నిర్ణయం.. అప్డేటెడ్ జీవో జారీ చేసిన ఏపీ సర్కార్..
Single Use Plastic
Follow us

|

Updated on: Dec 01, 2022 | 10:22 PM

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. గతంలో తీసుకువచ్చిన రూల్స్‌లో మరికొన్ని మార్పులు చేస్తే ఆప్‌డేటెడ్ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిషేధాజ్ఞలు పాటించని వారిపై పెనాల్టీలు కూడా విధించాలని మునిసిపల్, కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీదారులు, పంపిణీదారులకు పెనాల్టీలు వేయాలని స్పష్టం చేసింది. ఆ పెనాల్టీల వివరాలు ఇలా ఉన్నాయి.

తయారీ దారుల విషయంలో పెనాల్టీ వివరాలు..

1. మొదటి తప్పుగా రూ. 50వేలు జరిమానా, ప్లాస్టిక్ వస్తువుల సీజ్ చేస్తారు.

2. రెండో తప్పుగా లక్ష రూపాయల జరిమానా, రిజిష్ట్రేషన్ రద్దు, వస్తువులు, యంత్ర పరికరాలు సీజ్… వీటితో పాటు పర్యావరణ చట్టం కింద కేసులు నమోదు.

ఇవి కూడా చదవండి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్టాక్ పెట్టి, పంపిణీ చేసే వారి విషయంలో పెనాల్టీ వివరాలు..

1. మొదటి తప్పుగా రూ. 25వేలు జరిమానా, సీజ్ చేసిన వస్తువులపై కేజీకి పది రూపాయల పెనాల్టీ.

2. రెండవ తప్పుగా రూ. 50వేలు జరిమానా, సీజ్ చేసిన వస్తువులపై కేజికి 20 రూపాయలు తో పాటుగా పర్యావరణ చట్టం కింద కేసులు నమోదు.

కాగా, ఆదేశాలు శానిటరీ, వార్డ్ సిబ్బందికి కూడా తెలిసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. కమీషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మానిటరింగ్ మాడ్యూల్ వినియోగించాలని సూచించారు. రీజనల్ డైరెక్టర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం జరిగేలా చూడాలని ఆదేశించింది సర్కార్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..