AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భారత్‌ బంద్‌కు ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతు

ఈనెల 27న భారత్‌బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలిచ్చిన పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Andhra Pradesh: భారత్‌ బంద్‌కు ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతు
Bharat Bandh
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2021 | 6:08 PM

Share

ఈనెల 27న భారత్‌బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలిచ్చిన పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ చేపడుతున్న ఉద్యమంలో అంతా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ బంద్‌లో ఆర్టీసీ కూడా మధ్యాహ్నం వరకూ పాల్గొంటుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 35మంది ఆత్మబలిదానాలు వృధా కాకూడదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకలు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తమ ఎంపీలు పార్లమెంట్​లోగళం విప్పారని గుర్తు చేశారు. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్​కు మద్దతిచ్చాయి.

ఈ నెల 27న తలపెట్టిన భారత్​ బంద్​కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్​​ అసోషియేషన్​ ప్రకటించింది. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ భారత్​ బంద్​ పిలుపు మేరకు.. ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్​​ అసోషియేషన్ అసోషియేషన్ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

Also Read: ‘త్వరలో ఏపీ కేబినెట్‌లో మార్పులు.. వంద శాతం కొత్తవారే’

తుఫాన్‌కు ‘గులాబ్’ అని నామకరణం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన