AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Rocket: ఏలూరులో వెలుగులోకి కిడ్నీ రాకెట్ దందా.. మహిళ కిడ్నీకి రూ.7 లక్షలు ఇస్తామని రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న బ్రోకర్..

ఏపీలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా కిడ్నీ రాకెట్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. ఆధార్ కార్డులో పేర్లు మార్చిమరీ కిడ్నీలు కొట్టేస్తున్నారు కొందరు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదుతో కిడ్నీ గ్యాంగ్‌ గుట్టురట్టువుతోంది.

Kidney Rocket: ఏలూరులో వెలుగులోకి కిడ్నీ రాకెట్ దందా.. మహిళ కిడ్నీకి రూ.7 లక్షలు ఇస్తామని రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న బ్రోకర్..
Kidney Racket
Surya Kala
|

Updated on: Jun 30, 2023 | 7:36 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో వరుస కిడ్నీ రాకెట్‌ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నామధ్య విశాఖ కిడ్నీ రాకెట్‌ అరాచకాలు మరవకముందే.. అదేకోవకు చెందిన మరో ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా బట్టబయలైంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని కిడ్నీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. వారిని టార్గెట్‌ చేసి డబ్బులు ఎరగా చూపి కిడ్నీ రాకెట్ ముఠా చేస్తున్న దందా ఆధారాలతో బయటపడింది. ఏలూరు, విజయవాడల్లోని ప్రవేట్ ఆసుపత్రుల్లో సర్జరీ చేయిస్తున్నారు. తాజాగా.. ఏలూరు నగరానికి చెందిన అనురాధ అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. జీవనోపాథి కోసం కూరగాయలు వ్యాపారం చేసుకుంటుంది. దీంతో మహిళ అప్పులు పాలైంది. మహిళ ఆర్ధిక పరిస్థితిని అదునుగా తీసుకుని ఓ వ్యక్తి రంగంలోకి దిగిన కిడ్నీ బ్రోకర్ అవతారమెత్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. బాధితురాలి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని నీకు ఉన్న రెండు కిడ్నీల్లో ఒకటి అమ్మితే ఏడు లక్షల డబ్బులు వస్తాయి.. అప్పుల బాధ తీరి సుఖంగా బతక వచ్చు అంటూ ఆశ చూపాడు. అమాయకత్వాన్ని, ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని మాయ మాటలు చెప్పి మహిళను కిడ్నీ రాకెట్‌లోకి లాగాడు.

గుట్టుచప్పుడు కాకుండా ఇంటి పేరు మార్చి, ఓ మహిళను కన్‌ఫ్యూజ్‌ చేసి కిడ్నీ దోచేసింది కిడ్నీ గ్యాంగ్‌. ముందుగా కిడ్నీ కొనుగోలు చేసే వ్యక్తి భార్యగా ఆ మహిళ ఆధార్ కార్డులోని ఇంటి పేరును మార్చారు. ఆ వ్యక్తి భార్యగా దొంగ ఆధార్ కార్డును సృష్టించారు. అయితే.. ముందుగా మహిళ కిడ్నీకి ఏడు లక్షలు ఇస్తామని చెప్పి బేరం చేసుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత కిడ్నీ తీసుకుని చివరకు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు లక్ష రూపాయలు తన మెడికల్ ఖర్చులకు అయ్యాయని బాధిత మహిళా లోబోదిబోమంటోంది.

మిగిలిన డబ్బులు ఇవ్వమని అడిగితే తనను ఇబ్బందులకు గురిచేసి పరార్ అయ్యారని ఆ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నీ పోగొట్టుకున్న తాను అనారోగ్యం బారిన పడ్డానని.. కనీసం తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతోంది. ఓ వైపు కిడ్నీ పోయి ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ఆధార్ కార్డు లో ఇంటి పేరు మారడంతో ప్రభుతం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు  అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పిల్లలను కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నానంటోంది. కిడ్నీ పోయి.. అనారోగ్యం పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, న్యాయం చేయాలని వేడుకుంటోంది. అ క్రమంలోనే.. పోలీసులను ఆశ్రయించింది అనురాధ. కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..