AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Crime News: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు మృతి..

Andhra Pradesh Crime: విజయవాడ నగర శివారు కండ్రిక పాతపాడు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు.

Andhra Pradesh Crime News: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు మృతి..
Accident
Shiva Prajapati
|

Updated on: Sep 26, 2021 | 7:07 AM

Share

Andhra Pradesh Crime: విజయవాడ నగర శివారు కండ్రిక పాతపాడు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ భీకర ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కండ్రిక ప్రాంతం నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో కొత్తగా వంతెన నిర్మిస్తున్నారు. దానికి ఐరన్ రాడ్స్ ఉన్నాయి. అయితే, ముగ్గురు యువకులు పల్సర్ బైక్‌పై అతి వేగంగా వెళ్లి ఆ రాడ్స్‌ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ముగ్గురూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన ముగ్గురు యువకులూ విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన రాజు, రమణ, సింహాచలం గా గుర్తించారు పోలీసులు. అతి వేగంతో రహదారి డైవర్షన్ చూసుకోకుండా బైక్‌ను నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ముగ్గురు యువకుల మృతి నేపథ్యంలో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకులు కళ్లముందే మృత్యువాత పడటంతో వారి రోధన ఆకాశన్నింటింది. అది చూసి స్థానికులు సైతం చలించిపోయారు.

Also read:

AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Horoscope Today: ఈ రోజు ఏ రాశి స్త్రీలు సంతోషంగా గడుపుతారంటే.. ఆదివారం ఏయే రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Hyderabad News: మణికొండలో విషాదం.. డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు.. ఇంకా దొరకని ఆచూకీ..