Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan: మీ సాయం మరువలేనిది.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

CM YS Jagan: కరోనా సంక్షోభం వేళ ఆక్సీజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలిచినందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ..

CM YS Jagan: మీ సాయం మరువలేనిది.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2021 | 10:46 PM

CM YS Jagan: కరోనా సంక్షోభం వేళ ఆక్సీజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలిచినందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ కంపెనీలకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ఆయన రియల్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పంపించి ఎంతగానో సాయం చేశారని అన్నారు. ఈ సాయం మరువలేనిదంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇక రిలయన్స్‌ ఫౌండేషన్‌తో పాటు టాటా స్టీల్ లిమిటెడ్‌, జిందాల్ స్టీల్ కంపెనీలు కూడా ఏపీకి ఆక్సీజన్ సరఫరా చేశాయి. దాంతో ఈ కంపెనీల యాజమాన్యానికి కూడా ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఓ వైపు కరోనా వ్యాప్తి.. మరోవైపు ఆక్సీజన్ కొరతతో కష్టకాలంలో ఉన్న ఏపీకి టాటా స్టీల్ కంపెనీ 1000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సీజన్‌ను పంపించింది. అలాగే జిందాల్ స్టీల్ కంపెనీ కూడా 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సీజన్‌ను పంపించింది. వీరి దాతృత్వాన్ని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలాఉండగా.. ఆక్సీజన్ కోరత కారణంగా తిరుపతి రుయా ఆస్పత్రిలో చాలా మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సీజన్ సేకరణపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి ఆక్సీజన్ కేటాయింపుపై పలుమార్లు అభ్యర్థనలు పంపించింది. అలాగే ఇతర మార్గాల ద్వారా ఆక్సీజన్‌ను సమకూర్చే ప్రయత్నాలు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుతమతి చేసుకుంటోంది.

Also read:

Prabhas Salar: ప్ర‌భాస్‌కు అక్క‌గా న‌టించేది ర‌మ్య‌కృష్ణ కాదా..? తెర‌పైకి మ‌రో కొత్త హీరోయిన్ పేరు..

Gate Exam: వ‌చ్చే ఏడాది గేట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌.. పేప‌ర్‌లో ప‌లు మార్పులు చేర్పులు..

Taapsee Pannu: అలాంటి సినిమాలు చేసి టైమ్ వెస్ట్ చేయను.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్