Weather : 48 గంటల్లో మాల్దీవులు-కొమరిన్ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు, ఏపీ, యానాంకు వచ్చే 3రోజుల వరకు వాతావరణ సూచన
Weather forecast : నైరుతి రుతుపవనాలు ఈరోజు (25.05.2021) మాల్దీవులు-కొమరిన్ ప్రాంతములోని మరికొన్ని ప్రదేశాలు, నైరుతి, ఇంకా ఆగ్నేయ బంగాళాఖాతములలోని మరికొన్ని..
Weather forecast : నైరుతి రుతుపవనాలు ఈరోజు (25.05.2021) మాల్దీవులు-కొమరిన్ ప్రాంతములోని మరికొన్ని ప్రదేశాలు, నైరుతి, ఇంకా ఆగ్నేయ బంగాళాఖాతములలోని మరికొన్ని ప్రాంతాలలోనికి ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమరిన్ ప్రాంతం, ఇంకా నైరుతి బంగాళాఖాతము & తూర్పు మధ్య బంగాళాఖాతంలలోని మరికొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రము తెలియజేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
> ఈరోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు ఇంకా, ఈదురు గాలులు (45 – 55 kmph)వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
> ఈరోజు, రేపు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు ఇంకా ఈదురు గాలులు (45 – 55 kmph)వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
> ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు వెల్లడించారు.