Yaas Cyclone: తీరందాటిన ‘యాస్‘ తుపాను.. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..
Yaas Cyclone: తూర్పు తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన యస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఒడిశాలోని బాలసోర్ సమీపంలో తీరం దాటినట్లు...
Yaas Cyclone: తూర్పు తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన యస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఒడిశాలోని బాలసోర్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యాస్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 155కి.మీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో సముద్రపు అలలు భారీగా ఎగిసిపడ్డాయి. తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లోనూ కనిపించింది.
ఇదిలాఉంటే.. యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనే పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. గురువారం, శుక్రవారం నాడు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అవకాశం ఉందన్నారు.
దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం నాడు దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
Also read:
Tirumala : శ్రీవారి అలిపిరి నడకమార్గం రెండు నెలలు పాటు మూసివేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం…!