AP CM meets CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం వైఎస్ జగన్‌ భేటీ.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణతో జగన్ దంపతులు భేటీ అయ్యారు.

AP CM meets CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం వైఎస్ జగన్‌ భేటీ.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
Jagan Meets Cji Nv Ramana
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 25, 2021 | 9:39 PM

AP CM Jagan meets CJI NV Ramana: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణతో జగన్ సతీసమేతంగా భేటీ అయ్యారు. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఎన్వీ రమణ గౌరవార్ధం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతకుముందు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు రోడ్డు మార్గంలో చేరకున్న సీజేఐ ఎన్వీరమణ దంపతులు పొన్నూరులోని వీరాంజనేయ స్వామి ఆలయం, సహాస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. రెండు ఆలయాల్లో వారు ప్రత్యేక పూజాలు నిర్వహించారు.

క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సీజేఐ ఎన్వీ రమణను ప్రత్యేకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్‌ హెటల్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌, భారతిలు కలిసి మాట్లాడారు. వీరి భేటీలో ప్రధానంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి చేర్చించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు సీఎం దంపతులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరేళ్ల తరువాత జస్టిస్ ఎన్వీ రమణతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం విశేషం.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళా రెండో రోజు శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ను సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నోవోటెల్ కు చేరుకున్న ఎన్వీ రమణ దంపతులు, క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ చేసి, క్రైస్తవులకు శుభకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నగర ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను, ఇతర సందర్శకులను కలిసారు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణను కలిసేందుకు విచ్చేసిన సందర్శకులతో నోవాటెల్ కిటకిటలాడింది. తనను కలవడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని మర్యాపూర్వకంగా కలిశారు. మధ్యాహ్న నాలుగు గంటలకు సీఎం జగన్ సతీ సమేతంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసారు.అనంతరం ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం.. తేనీటి విందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తేనీటి విందులో సీజేఐకి.. రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి పరిచయం చేశారు.

Read Also…  Telangana: న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు.. నేటి నుంచి జనవరి 2 వరకు అమలు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!