Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు.. నేటి నుంచి జనవరి 2 వరకు అమలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుండి జవనరి 2 వరకు ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

Telangana: న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు.. నేటి నుంచి జనవరి 2 వరకు అమలు
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 25, 2021 | 6:35 PM

Omicron Curbs: అన్ని దేశాలతో పాటు భారత‌లోనూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరియెంట్ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలల నేపథ్యంలో మరింతగా విజృంభించే ప్రమాదం ఉన్నందున పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుండి జవనరి 2 వరకు ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. వేడుకల్లో సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించాలని ఆదేశాల్లో పేర్కొంది. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Telangana Covid Restrictions

Telangana Covid Restrictions

మరోవైపు, ఢిల్లీ ప్రజలు కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా సామూహిక వేడుకలపై నిషేధం విధించారు. రెస్టారెంట్స్, బార్స్‌లో 50 శాతం సామర్థ్యంతోనే నడవాలని ఆదేశించింది. పెళ్లిళ్లకు 200 మందికి మించి హాజరుకాకూడదని పేర్కొంది. అటు, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి పూట ఐదు మంది కంటే ఎక్కవగా గుమిగూడకూడదని పేర్కొంది. డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు ముంబైలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదరా, సూరత్, రాజ్‌కోట్, భావనగర్, జామ్‌నగర్, గాంధీనగర్, జునాగఢ్‌లో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫూ విధించారు. మొన్నటి వరకు రాత్రి 1 నుంచి ఉదయం 5 వరకు ఉండగా.. తాజాగా ఈ సమయాన్ని పొడిగించారు. Read Also…. Viral Video: సంతోషంగా జీవించడానికి కచ్చితంగా డబ్బే కావాలా.. ఆసక్తికర వీడియో పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర..