కులం, మతం పేరుతో విభజన ఉంటే స్వాతంత్య్రం రానట్టే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు..
పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు.
పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. చదువు మంచి అలవాటని.. మెదడులోని సోమాటో సెన్సరి ఆర్గాన్ యాక్టివేట్ అవుతుందన్నారు. గుంటూరు జేకేసి కాలేజ్ ఆడిటోరియంలో త్రిపురనేని రామస్వామి సర్వ లభ్య రచనల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్ర్యం ఇంకా రాలేదన్నారు. సమాజంలో అందరూ సమానులే అన్న అంశంతోనే రామస్వామి రచనలు చేశారన్నారు.
పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన డొక్కా మాణిక్య వర ప్రసాద్.. రామస్వామి చౌదరి ఆధునిక వేమన అని అన్నారు. వేమన వారసుడిగా రామస్వామి సమ సమాజం కోసమే రచనలు చేశారన్నారు. సమాజం బాగుపడాలంటే రామస్వామి రచనలపై ప్రతి ఏటా చర్చ జరగాలన్నారు. రామస్వామి, జాషువ రచనలను యువతకు పరిచయం చేయాలని నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు అన్నారు. ఎంత ఎక్కువగా పరిచయం చేస్తే అంత మంచి జరుగుతుందన్నారు. రామస్వామి రచనలు పుస్తక రూపంలో తీసుకొచ్చిన మనసు ఫౌండేషన్ రాయుడు, సంపాదకుడు పారా అశోక్ అభినందనీయులని అన్నారు.
Read Also.. AP CM meets CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం వైఎస్ జగన్ భేటీ.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు