Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు.. క్రిస్మస్ కేక్ కట్ చేసిన సీఎం జగన్..

క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Andhra Pradesh: అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు.. క్రిస్మస్ కేక్ కట్ చేసిన సీఎం జగన్..
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 21, 2022 | 5:21 AM

క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఒదిగి వుండాలని.. దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నాని అన్నారు ఏపీ సీఎం జగన్.

ప్రజలకు ఇంకా గొప్ప సేవ చేసే అవకాశం ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారాయన. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ చర్చ్ ల ఫాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..