Andhra Pradesh: పల్నాడులో అర్థరాత్రి దారుణ హత్య.. పెరిగిన పొలిటికల్ హీట్..
Andhra Pradesh: పల్నాడులో మిడ్‌నైట్ మర్డర్ కలకలం రేపింది. నర్సరావుపేటలో ఇబ్రహీమ్‌ను అత్యంత దారుణంగా నరికి చంపేశారు ప్రత్యర్ధులు. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా కర్నాటక బ్యాంక్ సమీపంలో ఎటాక్ చేశారు.

పల్నాడులో మిడ్‌నైట్ మర్డర్ కలకలం రేపింది. నర్సరావుపేటలో ఇబ్రహీమ్‌ను అత్యంత దారుణంగా నరికి చంపేశారు ప్రత్యర్ధులు. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా కర్నాటక బ్యాంక్ సమీపంలో ఎటాక్ చేశారు. ఈ దాడిలో ఇబ్రహీం స్పాట్‌లోనే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇబ్రహిం హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. నర్సరావుపేటలో అంజుమన్ కమిటీ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గతంలో ఉన్నవాళ్లకే షాపులు కేటాయించాలని కోర్టులో కేసు వేశాడు ఇబ్రహీం. దాంతో, కాంప్లెక్స్ నిర్మాణం ఆలస్యం కావడంతో ఇరువర్గాలను పిలిచి రాజీ చేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. పాత వాళ్లకే షాపులు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దాంతో, కేసు వెనక్కి తీసుకున్నాడు ఇబ్రహీం.
అయితే.. మసీదు, అంజుమన్ కమిటీలు వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఇబ్రహీం వినతిపత్రం ఇవ్వడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మరోసారి నిర్మాణం జాప్యం అవుతుందన్న భావన ప్రత్యర్థులకు వచ్చింది. దీంతో ఇబ్రహీం ను హతమార్చినట్లు బంధువులు ఆరోపించారు. దీనిపై టిడిపి నేత నల్లపాటి రాము వైసిపి నేతలే హత్య చేశారని ఆరోపించారు. రాజీ చేసుకోమని ఒత్తిడి తేవడమే కాకుండా కేసు వాపసు చేసుకోవాలని బెదిరించారన్నారు. ఇప్పుడు ఏకంగా మనిషే లేకుండా చంపేశారని అంటున్నారు.
టిడిపి ఆరోపణలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసి నిర్మాణం త్వరగా చేయాలన్న భావనతోనే ముందుకెళ్ళామన్నారు. పాత వారికి కూడా షాపులు కేటాయిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
