Chandrababu: తెలంగాణలో చంద్రబాబు పర్యటన.. భారీ బహిరంగ సభ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివారం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు.. 9.30 గంటలకు రసూల్‌పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 9.45 గంటలకు ఈశ్వరీబాబు విగ్రహం కూడలి వద్ద నుంచి హబ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ బస్‌డిపో మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. అలాగే 2.15 గంటలకు గూడెం మీదుగా కూసుమంచి చేరుకుంటారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ:
ఈ పర్యటనలో భాగంగా 2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం చేరుకుని మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రాత్రి 7.30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరి వెంకటయ్యపాలెం మీదుగా చింతకానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8.30 గంటలకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నాగలవంచ క్రాస్ రోడ్డు, నోనకల్, విజయవాడ హైవే మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి