మొంథా తుఫాను.. ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్! తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు
CM Chandrababu Naidu on cyclone montha: కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడండి. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి. రిలీఫ్ క్యాంపులకు తరలించండి. తుఫాను ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చు. ముందుగానే ప్రజలకు క్యాండిళ్లను సరఫరా జరిగేలా చూడండి. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలని తెలిపారు.
కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడండి. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి. రిలీఫ్ క్యాంపులకు తరలించండి. తుఫాను ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చు. ముందుగానే ప్రజలకు క్యాండిళ్లను సరఫరా జరిగేలా చూడండి. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. అలెర్టుగా ఉండండి. పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. అధికారులు-ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. భారీ వర్షాల వల్ల పడే నీరు నిల్వ ఉండకుండా.. కాల్వలు, డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంప్ చేయాలి.
విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలి. మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలి. తప్పుడు సమాచారం.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి. రైతులకు తుపాన్ అలెర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలి. పంట నష్టంపై ప్రాథమిక, పూర్తి స్థాయి అంచనాలను రూపొందించుకునే దిశగా ఫోకస్ పెట్టాలి. మొంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని జాతీయ రహదారులపై రాకపోకలను నిలపాలి. రహదారులపై రాకపోకలు నిలపాల్సిన పరిస్థితే వస్తే… సమాచారాన్ని ముందుగానే సమాచారం అందివ్వాలని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
