Andhra Pradesh: ఏడేళ్ల బాలికపై లైంగికదాడి… దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన చిత్తూరు పోక్సో కోర్టు

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడికి జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. 2018 జనవరి 13 న మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై 34 ఏళ్ల గంగాధర్...

Andhra Pradesh: ఏడేళ్ల బాలికపై లైంగికదాడి... దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన చిత్తూరు పోక్సో కోర్టు
Chittoor Pocso Court
Follow us

|

Updated on: Jul 23, 2021 | 9:02 PM

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడికి జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. 2018 జనవరి 13 న మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై 34 ఏళ్ల గంగాధర్.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై పాశవికంగా ప్రవర్తించాడు. రక్షించాల్సిన తండ్రి వయసులో ఉండి.. అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ కేసు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు.. నిందితుడికి కఠిన శిక్ష విధించింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో.. నిందితుడు మరో నాలుగేళ్లు పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది.

కేసు వివరాలు ఇవి…

రాజస్థాన్ కు చెందిన ప్రతాప్ కుటుంబం.. 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం మదనపల్లికి వచ్చింది. బొమ్మల తయారీతో పొట్టపోసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన చిన్నారిపైనే గంగాధర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా పని మీద బయటకు వెళ్లారు. పాప ఒక్కతే గుడారంలో ఉంది. కాపు కాచి.. కరెక్ట్ గా ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే.. గంగాధర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కామంతో కళ్లు మూసుకుని పోయి.. ఏడేళ్ల పసిపాపపై అమానుషంగా ప్రవర్తించాడు. చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అప్పట్లో గంగాధర్ పై టూ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. కరోనా కారణంగా విచారణలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. ఫోక్సో చట్టం కింద శిక్ష విధించింది.

Also Raed: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్

ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, రోవర్స్