AP Cabinet: రేపు ఏపీ రాష్ట్ర మంత్రి మండలి భేటీ.. కరోనా తీవ్రత, కర్ఫ్యూ విధింపుపై కీలక చర్చ!
ఏపీలో నిత్యం 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వికృతరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 4వ తేదీన ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో.. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్చలపైనే ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బుధవారం నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధింపును కేబినెట్ ఆమోదించనుంది.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతండటంతో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుంచి పగటిపూట పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి 12వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని పేర్కొంది. ఆ సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
అలాగే, రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండగా.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంపై కూడా దృష్టిసారించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్న సీఎం వైఎస్ జగన్.. ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలూ చర్చకు రానున్నాయి.
Read Also…. AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి