AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: కేసీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పని చేయాలి.. బీజేపీ నేత షాకింగ్ సవాల్..!

Bjp vs Trs: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రులు మరోసారి డ్రామాలకు తెర లేపారని బీజీపీ(BJP) రాష్ట్ర ప్రధాన..

Bjp vs Trs: కేసీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పని చేయాలి.. బీజేపీ నేత షాకింగ్ సవాల్..!
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2022 | 6:59 PM

Share

Bjp vs Trs: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రులు మరోసారి డ్రామాలకు తెర లేపారని బీజీపీ(BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. అనంతపురం నగరంలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. నిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కల్గించే కేసీఆర్.. ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంత ప్రేమ ఉంటే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో నిర్దాక్షిణ్యంగా ఎందుకు వ్యవహరించారని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. బీజేపీ అవినీతి చిట్టా బయటపెడుతామంటున్న కేసీఆర్ దమ్ముంటే.. ఆ పని చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌ పైనా విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ప్రత్యేక హాదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 2014 తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదన్న విషయం మీకు తెలియదా? అని వైసీపీ పెద్దలను ప్రశ్నించారు. ప్రధానిని ఇన్ని సార్లు కలిసినప్పుడు ఏ రోజైనా హోదా గురించి మాట్లాడారా? అని నిలదీశారు. హోదా కావాలన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఎందుకు తీసుకుంటున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి ఘాటైన పదజాలంలో విరుచుకుపడ్డారు.

Also read:

Stock Market: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు.. రూ. 10,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హాంఫట్..!

Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

AP Crime: వ్యాయామ ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. కోరిక తీరిస్తే కోరుకున్నది ఇస్తానని..