బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం..ఏడుగురికి గాయాలు

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం..ఏడుగురికి గాయాలు
Blast in Fire Crackers Factory
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 16, 2024 | 8:39 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని రావులచెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాణసంచా తయారు చేస్తున్న ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిసర ప్రాంతాల్లోని మరికొందరు కూడా గాయపడినట్టుగా తెలిసింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. గాయపడిన వారందరినీ అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం కిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.

పేలుడు ధాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్‌ సాయంతో తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్