వార్నీ.. కొంటేనే భయమట..! ఫ్రీగా ఇస్తే మాత్రం క్యూలైన్‌లో నిల్చుని మరీ..!
కాస్త కాస్ట్లీ అయినా సరే.. సండే వస్తే నాన్ వెజ్ ప్రియులు ఫిష్, మటన్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. బతికుంటే బలిసాకు తిని బతకవచ్చు.. చికెన్ కొని మరి తింటే ఎందుకు రోగాలు కొని తెచ్చుకోవాలని చాలామంది ఫిక్స్ అయిపోయారు. దీంతో చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతుంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు చికెన్ తింటే కోళ్లకు వచ్చిన ఫ్లూ మనుషులకూ సోకుతుందని ఆందోళన జనంలో కంటిన్యూ అవుతుంది. చికెన్ కూర తింటే అనారోగ్యం పాలవుతామన్న భయంతో.. ఫిష్, మటన్ వైపు చూస్తున్నారు.
కాస్త కాస్ట్లీ అయినా సరే.. సండే వస్తే నాన్ వెజ్ ప్రియులు ఫిష్, మటన్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. బతికుంటే బలిసాకు తిని బతకవచ్చు.. చికెన్ కొని మరి తింటే ఎందుకు రోగాలు కొని తెచ్చుకోవాలని చాలామంది ఫిక్స్ అయిపోయారు. దీంతో చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ బర్ల్ ఫ్లూ భయం కోడై కూయడంతో.. ఇక, పౌల్ట్రీ రంగం తీవ్రంగా పతనం అయిపోయింది. బాగా ఉడికించి తినే చికెన్, గుడ్లలలో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని.. ఇలాంటప్పుడు వాటిని తినవచ్చని వైద్య నిపుణులు, అధికారులు అవగాహన కల్పించినా జనం వినిపించుకోని పరిస్థితి ఎదురైంది తెలుగు రాష్ట్రాల్లో.. చికెన్, గుడ్లు రేట్లు తగ్గినా.. ఎవరూ కోడి వైపు కన్నెత్తైనా చూడలేదు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ వ్యాపారం ఎలాగా డీలాపడింది. అలాగే కొనసాగితే ఇంకా కొన్ని రోజులకు పౌల్ట్రీలు మూతపడే పరిస్థితిలో వస్తాయి. దీంతో ఇక పౌల్ట్రీ యజమానులు రైతులు కలిసి అవగాహన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాయి. చికెన్ ఎగ్స్‌తో స్నాక్స్ చేసి ఫ్రీగా పంచిపెట్టారు. అనకాపల్లి జిల్లాలో ఏకంగా కలెక్టర్ చికెన్ రుచి చూసి బర్డ్ ఫ్లూ భయం ఇక లేదంటూ అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్‌లో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ – నెక్, పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేళా నిర్వహించి ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని చికెన్ లెగ్ పీస్ లాగించేశారు. దీంతో ఇక చెప్పేదేముంది.. అధికారుల మాటలు మాట అలా ఉంచితే, ఫ్రీగా వస్తుంది కదా.. జనం ఎగబడ్డారు. ‘కొంటేనే బర్డ్ ఫ్లూ.. ఫ్రీగా ఇస్తే భయం లేదు గియం లేదు..’ అన్నంతలా ఎగబడి మరీ చికెన్ ఎగ్ స్నాక్స్ లాగిన్ చేశారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి చూసి మరీ, చికెన్ ఎగ్ స్నాక్స్ సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. అప్పటివరకు పుకారు చేసిన వాళ్లు కూడా.. ఫ్రీ చికెన్ కోసం క్యూ లైన్ లో కనిపించడంతో.. వార్నీ ఇది కదా అసలు సంగతి .. అంటూ నోళ్లు కొరుక్కున్నారు జనం..!
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..