AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: చిట్‌ ఫండ్‌ పేరుతో సర్వం దోచుకున్నాడు.. సిట్ దర్యాప్తుతో కదులుతున్న రూ.200కోట్ల పాపాల పుట్ట..

పల్నాడులో సాయిసాధన చిట్‌ ఫండ్‌ కంపెనీ గుర్తుందా...! వందలాది మంది నమ్మకాన్ని నట్టేట ముంచి... 200 కోట్లకు పైగా మూటగట్టుకున్న పుల్లారావు వెలగబెట్టిందే ఆ సాయిసాధన చిట్‌ ఫండ్స్‌ కంపెనీ. ఇప్పుడా కంపెనీ అక్రమాలపైనే విచారణ షురూ అయ్యింది. సిట్‌ రంగంలోకి దిగింది. బాధితుల నుంచి వివరాలను సేకరిస్తుంది..

AP News: చిట్‌ ఫండ్‌ పేరుతో సర్వం దోచుకున్నాడు.. సిట్ దర్యాప్తుతో కదులుతున్న రూ.200కోట్ల పాపాల పుట్ట..
Money
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2025 | 8:14 PM

పిల్లల చదువుల కోసం కొందరు. కూతురి పెళ్లి కోసం మరికొందరు. ఇళ్లు కట్టుకుందామని ఇంకొందరు… ఇలా వందలాది మంది చీటీలు వేస్తే… సుమారు 200 కోట్ల రూపాయిలతో ఉడాయించి… ఆవెంటనే పోలీసులకు దొరికిన పుల్లారావు కథ కొన్నాళ్ల క్రితమే పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగు చూసింది. సుమారు మూడు వారాల నుంచి బాధితులు లబోదిబోమంటున్నారు. అటు పోలీసులను… ఇటు కోర్టును సైతం ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. దాని ఫలితమే ఇవాళ సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) రంగంలోకి దిగింది. లోతుగా దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలకు సిద్ధమైంది..

దీనిలో భాగంగా సాయిసాధన చిట్‌ ఫండ్‌ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. మోసపోయినవారంతా ఆధారాలు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. అయితే బాధితులు మాత్రం నరసరావుపేట నుంచే విచారణ జరపాలని… అప్పుడే నిజానిజాలు బయటకొస్తాయని సిట్‌ని కోరుతున్నారు.

ఇక కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు పాలడుగు పుల్లారావు.. సుమారు 300 మంది నుంచి 200 కోట్ల రూపాయలు చిట్టీల రూపంలో తీసుకున్నారు. చిటీ విత్ డ్రా చేసుకునే వాళ్లకు అధికవడ్డీ ఆశ చూపాడు. ఆ డబ్బునంతా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి మళ్లించాడు. అంతేకాదు పక్కా ప్లానింగ్‌తో కోట్ల రూపాయలు అప్పుచేసి పరారయ్యాడు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇకీ పుల్లారావు లెక్కలు తేల్చేందుకు సిట్‌ రంగంలోకి దిగింది. త్వరలోనే అన్నీ విషయాలు బయటపెడతామంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..