AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఓ నూతన కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో సరదాగా 2024 అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

AP News: స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
Andhra Schools
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2024 | 4:38 PM

Share

ఏపీలోని స్కూల్ విద్యార్థులకు ఎండాకాలం సెలవులు షురూ అవుతున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ హాలిడేస్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ  ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఊర్లు వెళ్లేందుకు, ఎంజాయ్ చేసేందుకు పిల్లలు రెడీ అవుతున్నారు. పరీక్షల ఒత్తిడి నుంచి.. బయటపడి.. ట్రిప్స్ వేసేందుకు తల్లిదండ్రులకు వెళ్లాల్సిన ప్రాంతాల లిస్ట్ చెబుతున్నారు. అయితే సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఏపీ విద్యావాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్స్ కోసం మరో కొత్త ప్రోగ్రామ్ తీసుకువచ్చింది.

ఎండాకాలం సెలవులను స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకునేలా ఓ కొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో సరదాగా 2024 అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ కోసం కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని PTEలకు సూచించింది. అలాగే విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం మీద ఇంట్రస్ట్ పెంచేలా టీచర్లు. హెడ్ మాస్టర్లు వుయ్ లవ్ రీడింగ్ పేరిట కాంపిటీషన్ నిర్వహించాలని సూచించింది.

సెలవుల్లో సరదాగా కార్యక్రమం అమలుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్లాసుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. సెలవుల్లో సరదాగా కార్యక్రమం కింద విద్యార్థుల్లో దాగున్న స్కిల్స్ తో పాటుగా క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొనాలని గవర్నమెంట్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?