AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే

ప్రేమించిన యువతి తనను కాదందని యువకులు ప్రాణం తీసుకోవడమో, లేదా ప్రియురాలి ప్రాణాలు తీయడమో చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తనను దూరం పెట్టిందన్న కోపంతో ఏకంగా ప్రియురాలి ముక్కునే కోసేశాడు. ఈ వింత ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.

Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
Palnadu Violence
T Nagaraju
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 12:28 PM

Share

తనను దూరం పెట్టిందన్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా తన ప్రియురాలి ముక్కునే కోసేసిన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటుంది. భర్తతో విభేదించి దూరంగా ఉంటున్న మరియమ్మకు ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా మరియమ్మ పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పని చేసే వెంకట్రావుతో సహజీవనం చేసింది. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరూ మధ్య కూడా విబేధాలు రావడంతో వెంకట్రావుకు మరియమ్మ దూరంగా ఉంటుంది. వెంకట్రావును ఇంటికి రానీయకపోవడం, కనపడిన మాట్లాడకపోవడంతో మరియమ్మ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మరియమ్మకు బుద్ది చెప్పాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే నిన్న తన స్నేహితుడైన రాజశేఖర్‌తో కలిసి మరియమ్మ ఇంటికి వచ్చాడు. మరియమ్మ ఒక్కతే ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్ళారు. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో మరియమ్మ ముక్కు కోశాడు. ఆ ముక్కను తనతో తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మరియమ్మ ను స్థానికులు పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి నర్సరావుపేట ఆ తర్వాత గుంటూరు జిజిహెచ్ కు ఆమెను తీసుకెళ్లారు.

ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వెంకట్రావును దూరం పెట్టినందుకే తనపై కక్ష కట్టి దాడి చేసినట్లు మరియమ్మ ఆరోపించింది‌. మరియమ్మ పై దాడికి పాల్పడిన వెంకట్రావును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు..
ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు..
జనగణన ఫస్ట్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల.. అధికారులు మీ ఇంటికి వచ్చి..
జనగణన ఫస్ట్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల.. అధికారులు మీ ఇంటికి వచ్చి..
పాక్ ఆటగాళ్లతో హగ్గింగ్స్, హ్యాండ్‌షేక్స్.. వివాదంలో మనోళ్లు
పాక్ ఆటగాళ్లతో హగ్గింగ్స్, హ్యాండ్‌షేక్స్.. వివాదంలో మనోళ్లు
ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..?
ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..?
చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఈసారి 11 రోజుల ముందుగానే..
చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఈసారి 11 రోజుల ముందుగానే..
రోజుకు ఎన్ని చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిది..?
రోజుకు ఎన్ని చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిది..?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. అక్షర్ ప్లేస్‌లో ఎవరంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. అక్షర్ ప్లేస్‌లో ఎవరంటే?
రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్!
రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్!
తిరుమల శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఒకేసారి శ్రీకాళహస్తి కూడా
తిరుమల శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఒకేసారి శ్రీకాళహస్తి కూడా
ఏఐ రంగంలో భారత్ అద్భుతం .. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
ఏఐ రంగంలో భారత్ అద్భుతం .. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు