AP News: నల్లబెల్లం దెబ్బకు అక్కడి మార్కెట్ క్లోజ్.. ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న ఖాకీల నిర్ణయం..
Visakhapatnam's Anakapalle jaggery market: నల్ల బెల్లం వర్సెస్ పోలీసులు. అనకాపల్లిలో జరుగుతోన్న నయా వార్ ఇది. నాటుసారా సెంటర్ పాయింట్‌గా జరుగుతోన్న ఈ వార్ ఇప్పుడు ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌నే కుదిపేస్తోంది.
Anakapalle Jaggery Market: ఉత్తరాంధ్రలో నల్ల బెల్లంపై ఆంక్షలు సంచలనంగా మారింది. నల్ల బెల్లం సప్లైపై పోలీసులు ఆంక్షలు విధించడంతో దేశంలోనే రెండో అతిపెద్దదైన అనకాపల్లి బెల్లం మార్కెట్(Anakapalle Jaggery Market) మూతపడింది. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఏకంగా స్థానిక రాజకీయాలనే కుదిపేసే స్థాయికి వెళ్లింది. పోలీసుల చర్యలను ఏకంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు తప్పుబట్టడంతో విశాఖ డీఐజీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవల నాటుసారా డెత్స్ పెరిగిపోవడంతో నల్ల బెల్లంపై ఆంక్షలు విధించినట్లు క్లారిటీ ఇచ్చారు. నాటుసారా తయారీదారులు నల్ల బెల్లం వినియోగిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్‌తోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నాటు సారాకు నల్ల బెల్లం సప్లై కాకూడదన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఎవరైతే నాటు సారా తయారీకి సహకరిస్తున్నారో వాళ్లపై కచ్చితంగా కేసులు, చర్యలు ఉంటాయని విశాఖ (Visakhapatnam) రేంజ్ డీఐజీ హరికృష్ణ హెచ్చరించారు.
అనకాపల్లిలో నాటు సారా పెరిగిపోవడంతోనే ఆంక్షలు విధించామంటున్నారు పోలీసులు. కేవలం 50రోజుల్లోనే 2వేలకుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరివర్తన్ 2.0 పేరుతో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నా మార్పు రావడం లేదంటున్నారు పోలీసులు. అందుకే, నల్ల బెల్లం సప్లైపై ఆంక్షలు విధించామని అంటున్నారు. అయితే, నిజాయితీగా వ్యాపారం చేసుకునే వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..