AP News: లోయలో పడిన బస్సు .. 30 మంది ప్రయాణికులకు గాయాలు
పులివెందులలో లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడప రిమ్స్‌కు తరలించనున్నారని సమాచారం.

కడప జిల్లాలోని పులివెందులలో కదిరి పులివెందుల రోడ్డు మార్గంలోని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది కదిరి నుంచి పులివెందుల వస్తున్న మార్గంలో కొండ ప్రాంతం ఉంది .అక్కడ చిన్న ఘాట్ రోడ్డు ఒకటి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 మంది ప్రయాణికులతో కదిరి నుంచి పులివెందుల వస్తుండగా ఘాట్ రోడ్డు దగ్గరకు రాగానే అదుపుతప్పి 30 అడుగుల లోయలోకి పడిపోయి బోల్తా కొట్టింది. బస్సులో ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ముగ్గురికి తీవ్రమైన గాయాలైనట్లు సమచారం. వారిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడప రిమ్స్‌కు తరలించనున్నారని సమాచారం.
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అలాగే పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్‌గా బస్సు లోయలోకి వెళ్లిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు.
వీడియో ఇదిగో:
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
