Tirupati: అయ్యయ్యో.. రుయా..! కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మి తీసుకెళ్లిన తండ్రి

Tirupati Ruia Hospital: తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ మరణించిన బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది

Tirupati: అయ్యయ్యో.. రుయా..! కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మి తీసుకెళ్లిన తండ్రి
Ruia Hospital
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 26, 2022 | 11:26 AM

Tirupati Ruia Hospital: తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ మరణించిన బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు అందర్ని కలచివేస్తోంది. దీంతో చేసేదేం లేక ఆ తండ్రి.. బాలుడి మృతదేహాన్ని బైక్‌పై సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రి (Ruia Government Hospital) వద్ద జరిగడం కలకలం రేపుతోంది. ఉచిత అంబులెన్సులో బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రైవేటు అంబులెన్స్‌(Amubulance Mafia) నిర్వాహకులు వ్యవహరించిన తీరు దారుణమంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జేసివ అనే బాలుడు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని రుయా ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు ఉచిత అంబులెన్స్‌‌ను పంపారు.

అయితే.. బయటి అంబులెన్స్‌లు రుయా ఆసుపత్రిలోకి వచ్చే ప్రసక్తే లేదని.. తమ వాహనంలోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు అడ్డుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా.. కనీస కనికరం లేకుండా నిర్వాహకులు బాలుడి తల్లిదండ్రులతో గొడవకు దిగారు. దీంతో చేసేదేం లేక తండ్రి కుమారుడి మృతదేహాన్ని 90 కి.మీ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాగా.. రుయా ఆసుపత్రిలో రోజురోజుకు అంబులెన్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో మృతిచెందిన దేహాలను ఉచిత అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించడం లేదని పేర్కొంటున్నారు. అంబులెన్స్ మాఫియాను కట్టడి చేయలేకపోతున్న ఆసుపత్రి అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో సింపుల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు..

Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.