Perni Nani: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని .. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు..
AP Politics: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేసిన ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది
AP Politics: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేసిన ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పీకే వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని, పొత్తులపై ముఖ్యమంత్రి జగన్ దే తుదినిర్ణయమని విజయసాయిరెడ్డి చెప్పగా, వైఎస్ఆర్ కుంటుబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ తో ఎందుకు కలుస్తామని గుడివాడ వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani ) పీకే వ్యాఖ్యలు, పొత్తులపై స్పందించారు…’ప్రశాంత్ కిషోర్ మా పార్టీకి కేవలం కన్సల్టెంట్ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలను మాత్రమే వాడుకుంటాం. అంతేకానీ వైసీపీని ఎవరూ శాసించలేరు. ఎన్నికలయ్యాక కేంద్రంలో మా ఎంపీల సంఖ్యా బలం అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతునిస్తాం. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ కూటమి కాగితంపై రాసి ఇస్తేనే మా మద్దతునిస్తాం’ అని పేర్నినాని తెలిపారు.
సింగిల్ గానే బరిలోకి..
కాగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు పేర్నినాని. ఈ సందర్భంగా ఆయన మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. ‘ పవన్ కళ్యాణ్ కు వావివరసలు లేవు. చంద్రబాబు కోసం చేసే పనిలో పదోవంతు తన అన్న కోసం చేయాలి’ అని పవన్‌కు చురకలు అంటించారు. కాగా క్యాబినేట్‌లో మళ్లీ చోటు దక్కకపోవడంపై స్పందించిన నాని.. ‘మంత్రి పదవి కన్నా నాకు జగన్ ఇస్తున్న గౌరవమే ఎక్కువ. నాకు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈనెల 27న సమావేశం జరగనుంది’ అని నాని పేర్కొన్నారు.
Also Read:
నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!
Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..