Andhra Pradesh: ఇదెక్కడి విడ్డూరం.. పోస్టుమార్టం చేస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్లు

Andhra Pradesh: ఇదెక్కడి విడ్డూరం.. పోస్టుమార్టం చేస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్లు
Ap News

AP News: ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వైద్యులు చేయాల్సిన పోస్టుమార్టం ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఆస్పత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ram Naramaneni

|

Feb 10, 2022 | 9:26 AM

Nellore District: ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వైద్యులు చేయాల్సిన పోస్టుమార్టంను ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఆస్పత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్‌ డ్రైవర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిసినా, ఆస్పత్రి అధికారులు పట్టనట్టు వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు ప్రోద్బలంతోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సాయంత్రం 4 గంటల పైన అనుమానాస్పద కేసులను పోస్టుమార్టం చేయకూడదు. కానీ, కావలి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తే ఏ సమయంలో నైనా పోస్టుమార్టం చేస్తున్నారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి వర్గాల తీరుపై ప్రజలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. కాగా ఈ విషయం బయటకు పొక్కడంతో డ్యూటీ డాక్టర్ సద్దాం హుస్సేన్‌కి సూపరింటెండెంట్ మెమో జారీ చేశారు. ఇంత జరిగితే మెమోతో సరిపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu