Pawan Kalyan: నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రున్ని.. త్వరలో రెండు రాష్ట్రాల్లో యాత్ర చేపడతా..

Pawan Kalyan: జనసేన(Janasena)అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసిపీ మంత్రుల, నేతలు పదే పదే నన్ను దత్తపుత్రుడు అని అంటున్నారు.. నేను ప్రజలకు..

Pawan Kalyan: నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రున్ని.. త్వరలో రెండు రాష్ట్రాల్లో యాత్ర చేపడతా..
Pawan Kalyan
Follow us

|

Updated on: Feb 10, 2022 | 10:33 AM

Pawan Kalyan: జనసేన(Janasena)అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసిపీ మంత్రుల, నేతలు పదే పదే నన్ను దత్తపుత్రుడు అని అంటున్నారు.. నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ్ణి అన్నారు. అంతేకాదు ఏపీలో ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదు.. అది ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం చూశాం. రాజీ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా నన్ను దత్తపుత్రుడు అన్నారు.. అయితే నేను వైసీపీ నాయకత్వానికి ఒక్కటే తెలియజేస్తున్నాను…తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడుని. వైసీపీ నాయకులు, సలహాదారులు, గౌరవ పెద్దలు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. ఉద్యోగుల సమస్యను విపక్షాలు సృష్టించింది కాదు. ఎన్నికల సమయంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు ఆశలు కల్పించింది మీరు. వాళ్లకు రావాల్సింది, పే రివిజన్ కమిషన్ సూచించిందే అమలు చేయమని అడుగుతున్నారు. అమలులో చాలా ఆలస్యమైంది. దీని కోసం చాలా సమావేశాలు నిర్వహించారు. మంత్రులు కూర్చున్నా తెగలేదు. ఉద్యోగులకు కోపం వచ్చి లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేనను, మిగతా పార్టీలను విపక్షాలను విమర్శించడం సమర్థవంతమైన చర్య కాదు. వైసీపీ నాయకులు, ప్రభుత్వ ధోరణి ఎలా ఉందంటే వాళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. వాళ్లు ఏం చేసిన డూడూ బసవన్నలా తల ఊపేసి ముందుకెళ్లిపోవాలి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని విధులకు హాజరవుతున్న టీచర్ల వరకు అందరినీ శత్రువులుగానే చూస్తారు.

వెటకారాలు ఆపి పని చూడండి మేము డూడూ బసవన్న పని చేయలేం. న్యాయంగా ఉద్యోగులకు దక్కాల్సిన హక్కు గురించే వారు అడుగుతున్నారు. ప్రభుత్వం చేయాల్సింది చేస్తే వాళ్లెందుకు రోడ్లు మీదకు వస్తారు. మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. ఈ రోజు టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారంటే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఇచ్చిన మాట మీద నిలబడకుండా వెటకారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు వెటకారాలు ఆపి పని చూడండి. అదొక్కటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేదని చెప్పారు పవన్ కళ్యాణ్.

ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి. విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్లిందన్న సజ్జల కామెంట్ పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నేను మాట్లాడిన మాటలు ప్రభుత్వ సలహాదారులు సజ్జలకి ఇబ్బంది కలిగించాయని మాట్లాడుతున్నారు. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఆధిపత్య ధోరణి అంటే హై-హ్యాండెడ్ నెస్ అని తన ఉద్దేశమని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని ఎందుకు అన్నానంటే… సమస్య వచ్చి రోడ్ల మీదకు వచ్చిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించడం, మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడం చూసి ప్రభుత్వం హై-హ్యాండెడ్ గా బిహేవ్ చేసింది అన్నాను. నా మాటలను వక్రీకరించ వద్దు అంటూ వివరణ ఇచ్చారు. రోడ్డు మీద వచ్చి ఉద్యోగులు నిరసన చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చి ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకుకుంది. అదేదో ముందే చేస్తే ఈ గొడవ ఉండేదే కాదు కదా అన్నారు పవన్ కళ్యాణ్.

తెలంగాణ యాత్రలో భాగంగా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశాలు:

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర’ సంకల్పించానని చెప్పారు పవన్ కళ్యాణ్. మా ఇంటి ఇలవేల్పు, ఆరాధ్యదైవం, నన్ను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి, నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకొని, అనంతరం ధర్మపురి నారసింహుని క్షేత్రం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గుట్ట నారసింహుని క్షేత్రాన్ని దర్శించుకుంటాను. మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించి ప్రజలను చల్లగా చూడాలని స్వామి దీవెనలు కోరుకోవడానికి ఈ యాత్ర సంకల్పించాను. తెలంగాణలోని క్షేత్రాల పర్యటనలో భాగంగా అక్కడి నాయకులు, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయాలని నిర్ణయించాం. అలాగే మార్చి 14న ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు జనసేనాని.

Also Read:

 గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక.. ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!