Andhra Pradesh: రాయలసీమకు వర్ష సూచన.. ఇవాళ, రేపు వానలే వానలు.. అంతే కాకుండా
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళను దాటేసి కర్ణాటక(Karnataka), తమిళనాడు మీదుగా విస్తరిస్తున్నాయి. ఇవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు, అటు నుంచి తెలంగాణకు వ్యాపిస్తాయని...
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళను దాటేసి కర్ణాటక(Karnataka), తమిళనాడు మీదుగా విస్తరిస్తున్నాయి. ఇవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు, అటు నుంచి తెలంగాణకు వ్యాపిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో వీస్తున్న పవనాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(Rains in AP) కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి.
మరోవైపు.. మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన దేశ ప్రజలకు ఐఎండీ(IMD) తీపి కబురు చెప్పింది. ఈ వానాకాలంలో సాధారాణం కన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముందుగా అనుకున్న దాని కంటే అధికంగా వానలు పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదివారమే కేరళ(Kerala) ను నైరుతి రుతుపవనావలు తాకాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా రుతు పవనాల కదలికల్లో వేగం పెరిగిందని వివరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి