ఏపీ సీఎంవో, ఎస్‌ఈసీ మధ్య ఎస్‌ఎంఎస్‌ వివాదం..!

AP CMO And SEC: లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని.. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపించారు. ఇక తనకు అందిన మెసేజ్‌పై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తనను ఎలా ముఖ్య కార్యదర్శి నిర్వహించే సమావేశానికి పిలిపిస్తారంటూ తమ […]

ఏపీ సీఎంవో, ఎస్‌ఈసీ మధ్య ఎస్‌ఎంఎస్‌ వివాదం..!
Follow us

|

Updated on: Oct 25, 2020 | 6:11 PM

AP CMO And SEC: లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని.. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపించారు.

ఇక తనకు అందిన మెసేజ్‌పై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తనను ఎలా ముఖ్య కార్యదర్శి నిర్వహించే సమావేశానికి పిలిపిస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి సమాధానం పంపారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కాగా, ఎస్ఈసీ సెక్రటరీ వాణీమోహన్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామని చివరికి ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం వివరణ ఇచ్చింది.