AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైర‌స్ క‌ట్ట‌డికి “వైన‌తేయ హోమం”..! సూర్య దేవాలయంలో పూజ‌లు..

వ్యాక్సిన్ లేని వైర‌స్ నివార‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గంగా భావించిన ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సర్వ జన సంక్షేమం కోసం కొన్ని ఆల‌యాల్లో ప్ర‌త్యేక హోమాలు, యాగాలు నిర్వ‌హిస్తున్నారు.

వైర‌స్ క‌ట్ట‌డికి వైన‌తేయ హోమం..! సూర్య దేవాలయంలో పూజ‌లు..
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2020 | 5:29 PM

Share
ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. భార‌త్‌లోనూ కోవిడ్ వైర‌స్ ప్ర‌తాపం చూపుతున్న త‌రుణంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఇంత‌వ‌ర‌కు స‌రైన వ్యాక్సిన్ లేని వైర‌స్ నివార‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గంగా భావించిన ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆల‌యాలు కూడా మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే సర్వ జన సంక్షేమం కోసం కొన్ని ఆల‌యాల్లో ప్ర‌త్యేక హోమాలు, యాగాలు నిర్వ‌హిస్తున్నారు.
విశ్వ‌శాంతి, సర్వ జన సంక్షేమం కోసం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి  సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో గల అనివెట్టి మండపం నందు “వైనతేయ” హోమం నిర్వ‌హించారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా దేశం సుభిక్షంగా ఉండాలని.. వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక హోమాలను అరసవల్లి సూర్య క్షేత్రంలో నిర్వహిస్తున్న‌ట్లు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు వెల్ల‌డించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన  సూర్యనారాయణ స్వామి  ఈ మహమ్మారిని ప్రబలకుండా చేయాలని ప్రార్థించినట్లు  పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక  దూరాన్ని పాటిస్తూ ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నామని సహాయ కమిషనర్ , కార్యనిర్వాహణాధికారి పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనల దృష్ట్యా భక్తులు ఎవరినీ ఈ హోమ పూజలకు అనుమతించడం లేదని తెలిపారు.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం