ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి వేతనాల్లో మరో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డోన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా కోత పడటంతో...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి వేతనాల్లో మరో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డోన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా కోత పడటంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాల్లో వరుసగా రెండో నెల కూడా కోత విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
గత నెల లాగానే ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్దతిలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల ఇబ్బందుల దృష్ట్యా అన్ని రకాల పెన్షన్ దార్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చింది.
గత నెల లాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు జీతాల ను 100 శాతం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల జితాల్లో 60 శాతం వాయిదా వేయనున్నారు. మిగిలిన ఉద్యోగులకు 50 జీతాలు శాతం వాయిదా వేస్తారు. నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, వార్డు, గ్రామ వాలంటీర్ ల జీతాల్లో 10 శాతం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు
అయితే లాక్ డౌన్లోడ్ పీరియడ్ లోనూ కరుణ వైరస్ ప్రమాదకరమైన పరిస్థితులలోనూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, పోలీస్ వారికి, వైద్య సిబ్బంది 100 శాతం జీతాలు చెల్లిస్తారు.




