లిక్క‌ర్ ప్రియుల‌కు కిక్కెక్కించే ట్వీట్స్ చేసిన వ‌ర్మ‌..

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ప్ర‌భుత్వాలు కట్టుదిట్టంగా ఆంక్షలు అమ‌లువుతున్నాయి. ముఖ్యంగా లిక్కర్, వైన్ షాప్స్ విషయంలో చాలా కఠినమైన నిబంధ‌న‌లే ఉన్నాయి. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన‌ రామ్‌గోపాల్ వర్మ.. లిక్క‌ర్ షాపులు తెరవాలని కోరుతూ ఇన్‌డైరెక్ట్‌ ట్వీట్స్ చేశారు. మద్యం దొరకకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర‌వుతాయో వ‌ర్మ ఏక‌రువు పెట్టారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్‌ మార్కెట్ పెరిగి ప్రజల ఆర్ధిక అవసరాలకు నష్టం క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. […]

లిక్క‌ర్ ప్రియుల‌కు కిక్కెక్కించే ట్వీట్స్ చేసిన వ‌ర్మ‌..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 3:28 PM

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ప్ర‌భుత్వాలు కట్టుదిట్టంగా ఆంక్షలు అమ‌లువుతున్నాయి. ముఖ్యంగా లిక్కర్, వైన్ షాప్స్ విషయంలో చాలా కఠినమైన నిబంధ‌న‌లే ఉన్నాయి. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన‌ రామ్‌గోపాల్ వర్మ.. లిక్క‌ర్ షాపులు తెరవాలని కోరుతూ ఇన్‌డైరెక్ట్‌ ట్వీట్స్ చేశారు.

మద్యం దొరకకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర‌వుతాయో వ‌ర్మ ఏక‌రువు పెట్టారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్‌ మార్కెట్ పెరిగి ప్రజల ఆర్ధిక అవసరాలకు నష్టం క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ‌గా కోరుకునే దాన్ని ఇలా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయే ప్ర‌మాదం ఉంది. అల‌వాటును ఆప‌లేని కొంద‌రు ఊహించ‌ని మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కారణంగా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది” అని వర్మ ట్వీట్ చేశారు.

ఆల్కహాల్‌ దొరకకపోవడం కారణంగా కొందరిలో పెరిగిపోతున్న అస‌హనం ప‌ట్ల నేత‌లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వర్మ తెలిపారు. కోవిడ్-19 తెచ్చిన ఈ క‌ష్టాలు పరిపాలన విభాగాలపై చిరాకు తెప్పిస్తున్నాయని, అయినా ఆల్కహాల్‌కి.. కరోనాకు సంబంధం లేదని పేర్కొంటూ లిక్క‌ర్ ప్రియుల‌కు సపోర్ట్ చేసే ట్వీట్స్ చేశారు వర్మ.