AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు బృందం.. ఏపీలోని పరిస్థితులపై ఫిర్యాదు..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఏపీలోని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది...

TDP: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు బృందం.. ఏపీలోని పరిస్థితులపై ఫిర్యాదు..
Cnb
Srinivas Chekkilla
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 25, 2021 | 4:23 PM

Share

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఏపీలోని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోతోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి రామచంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని, దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. మద్యపాన నిషేధం పేరుతో లిక్కర్ రేట్లు భారీగా పెంచారని.. మాఫియా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అడ్డుకోవాలని టీడీపీ కోరితే.. తమ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారి జరిగిందని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంగా ఆరోపించారు.

ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్లు తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థను డీజీపీ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు ఆయన్ను శిక్షించాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యయుతంగా టీడీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, దోషులను కఠినంగా శిక్షించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు.

హస్తినలో మరికొందరు నేతలను కలవనున్న చంద్రబాబు

హస్తినలో మకాం వేసిన చంద్రబాబు నాయుడు,  టీడీపీ సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనేతలతను కూడా కలువనున్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు, డ్రగ్స్ వ్యవహారం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, గవర్నర్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అలాగే టీడీపీ ఆఫీస్‌పై దాడిని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతోంది. రాష్ట్రపతికి కూడా ఇవే అంశాలపై ఫిర్యాదు చేయానున్నారు. రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వీలైతే మరి కొందరు కేంద్ర పెద్దలను కలవాలని భావిస్తున్నారు.

Read Also.. AP Politics: చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలి…సంతకాలతో వైసీపీ ఎమ్మెల్యే లేఖ