ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ!
ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]
ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అవమానకరమేనని స్పష్టం చేశారు.
ఇక పొలిటికల్ మ్యాప్‌లో అమరావతి మిస్సింగ్ అంశంపై కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టడమే కాకుండా.. మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రివైజ్డ్ మ్యాప్‌ను విడుదల చేసింది. కాగా, గల్లా జయదేవ్ లోక్‌సభలో ఈ అంశంపై పోరాడి.. అమరావతిని సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్‌లో చేర్చేలా చేసినందుకు నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు.
You can paint anything in this world except the hard work of true leaders. @ncbn put Amaravati on the world map. @JayGalla made sure the Survey of India released a new map with Amaravati as Capital of AP by raising the ‘missing’ issue in the Parliament. Hearty congratulations pic.twitter.com/09Hug4ZPtm
— Lokesh Nara (@naralokesh) November 22, 2019
ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వెయ్యొచ్చు కష్టానికి తప్ప… అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది @ncbn గారు. లోక్ సభలో పోరాడి, అమరావతిని చేర్చి సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ ని విడుదల చేసేలా చేసిన టీడీపీ ఎంపీ @JayGalla గారికి అభినందనలు. pic.twitter.com/aK5heaO9JB
— Lokesh Nara (@naralokesh) November 22, 2019
Thx MOS Home, Kishan Reddy Garu, for taking prompt action after my Zero Hour intervention in Parliament yesterday, and including the new capital of Andhra Pradesh on the new political map of India. Amaravati will happen!! https://t.co/gO6Ddjkl22
— Jay Galla (@JayGalla) November 22, 2019
#Amaravati, the #Capital of AP, not featuring in the new political map issued by MHA, is an insult to not just AP, but also the Hon. PM, who laid the #foundation stone for its development. During Zero Hour, requested GoI to reissue the map showing Amaravati as Capital of AP. pic.twitter.com/w6D21fk10K
— Jay Galla (@JayGalla) November 21, 2019