బ్రేకింగ్.. ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. నీలం సాహ్ని 1984 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. కాగా, ఇటీవలే ఆమె కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌కు సీఎస్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే […]

  • Publish Date - 11:03 pm, Wed, 13 November 19 Edited By:
బ్రేకింగ్.. ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. నీలం సాహ్ని 1984 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. కాగా, ఇటీవలే ఆమె కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌కు సీఎస్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే తాజాగా నీలం సాహ్నిని నియమించడంతో నీరబ్‌కుమార్‌ను సీఎస్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు.