NEDCAP: బాబు హయాంలో జరిగిన రూ. 22,868 కోట్ల అవినీతికి పక్కా సాక్ష్యాలు.. స్కాం బయటకు తీస్తాం: నెడ్‌క్యాప్ చైర్మన్

చంద్రబాబు హయాంలో నెడ్‌క్యాప్ అడ్డగోలుగా దోచుకున్నారనీ.. అనేక స్కాంలు చేశారనీ.. నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆరోపణలు చేశారు. 2014 నుండి 2019 మధ్య రూ. 60 వేల కోట్ల PPA లు అడ్డగోలుగా

NEDCAP: బాబు హయాంలో జరిగిన రూ. 22,868 కోట్ల అవినీతికి పక్కా సాక్ష్యాలు.. స్కాం బయటకు తీస్తాం: నెడ్‌క్యాప్ చైర్మన్
Nedcap
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 10, 2021 | 8:55 PM

NEDCAP – Chandrababu – KK Raju: చంద్రబాబు హయాంలో నెడ్‌క్యాప్‌ను అడ్డగోలుగా దోచుకున్నారనీ.. అనేక స్కాంలు చేశారనీ.. నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆరోపణలు చేశారు. 2014 నుండి 2019 మధ్య రూ. 60 వేల కోట్ల PPA లు అడ్డగోలుగా చేసుకున్నారన్నారు. వాటికి పక్కా ఆధారాలు ఉన్నాయని రాజు స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొత్తంగా రూ.22,868 కోట్ల అవినీతి జరిగిందని.. దానిని బయటకు తీయబోతున్నట్లు నెడ్‌క్యాప్ రాజు తెలిపారు. 8784 మెగావాట్ల విద్యుత్ డబ్బులు బాబు జేబుల్లోకి నింపుకున్నారని రాజు ఆరోపించారు. సౌర, పవన విద్యుత్‌లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని రాజు పేర్కొన్నారు.

నెడ్‌క్యాప్ సంస్థ నవరత్నాలు అనే తొమ్మిది పునరుత్పాదక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించిన చైర్మన్ రాజు.. ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతంగా ఉన్న పునరుత్పాదక విద్యుత్ వాటా.. రాబోయే రోజులలో 60 శాతానికి పెంచాలన్నది సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని.. నెడ్‌క్యాప్ దానికి తగ్గట్టు పనిచేస్తుందని తెలిపారు.

Read also: YS Sharmila: హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలి.. వైయస్ షర్మిల పిలుపు