YS Sharmila: హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలి.. వైయస్ షర్మిల పిలుపు

నిరుద్యోగులందరూ హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలని వైయస్ఆర్టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. పోటీ చేసే అందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల్లో

YS Sharmila: హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలి.. వైయస్ షర్మిల పిలుపు
Ys Sharmila Visit
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 10, 2021 | 7:21 PM

YSRTP: నిరుద్యోగులందరూ హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలని వైయస్ఆర్టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. పోటీ చేసే అందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలుంటే ఆయా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తేనే పథకాలు వస్తాయని ఆమె అన్నారు. దళిత బంధు పథకం కింద దళితులకు రూ.10 లక్షలు కాదు.. రూ.51 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఇవాళ షర్మిల నిరుద్యోగులకు అండగా 5వ దఫా మంగళవారం దీక్ష నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట మండలం, సిరిసేడు గ్రామంలో షర్మిల దీక్ష చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గ్రామానికి చెందిన షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల ఈ సందర్బంగా పరామర్శించారు. షబ్బీర్ మనస్సు ఎంత క్షోభిస్తే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడని ఆవేదని వ్యక్తం చేసిన షర్మిల.. తెలంగాణకు విద్య, వైద్యం అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని చెప్పుకొచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక పగలు, ప్రతీకారాలు చూపించుకునేందుకు తీసుకువచ్చారన్న షర్మిల.. ఈ ఉప ఎన్నికలతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని తేల్చి చెప్పారు. ఏడేళ్లలో ఏడు వేల మంది నిరుద్యోగులు చనిపోయారు.. ఓటు కోసం ఏ పార్టీ వాళ్లు వచ్చినా నిలదీయండి అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. లావణ్య అనే నిరుద్యోగి సెల్ఫీ వీడియో తీసుకోని ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని షర్మిల విమర్శించారు.

Sharmila

Sharmila

Read also: ‘గ్యాంగ్‌’ మూవీ తరహా దోపిడీ. ఇన్నోవా కారు.. చేతిలో ఐడీ కార్డు.. లేడీ సహా ఐదుగురు ఫేక్ ఐటీ ఆఫీసర్స్. కట్ చేస్తే..!