తక్షణమే చర్యలు తీసుకోండి: మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశం..!

తక్షణమే చర్యలు తీసుకోండి: మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశం..!

విశాఖపట్టణంలోని గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై  విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,

TV9 Telugu Digital Desk

| Edited By:

May 07, 2020 | 10:05 AM

విశాఖపట్టణంలోని గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై  విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంపరపాలెం, కృష్ణానగర్ తదితర ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని గౌతమ్ రెడ్డి సూచించారు. ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలెవన్ కి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తోందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. అందరినీ రక్షించుకుంటాం గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి స్థానిక ప్రజలను అధికారులు, యువత దూరంగా తరలించడం అభినందనీయం మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

Read This Story Also: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu