పాలన వ్యవహారంలో ఈసీ జోక్యం తగదు: కనకమేడల
ప్రతిపక్షనేత కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని.. ఎన్నికల కోడ్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఐదేళ్లపాటు పాలనచేసే అధికారం ఉంటుందని చెప్పిన ఆయన.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోవాలని ఎక్కడా లేదని, పాలన వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకోవడం మంచిది కాదని కనకమేడల అన్నారు.