వైఎస్ జగన్‌పై ‘అలీ’గారా..?
ఓ వైపు సంచలన నిర్ణయాలతో పరిపాలన కొనసాగిస్తూనే.. మరోవైపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఇటీవల లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ పదవిని అప్పగించిన ఆయన.. ఇప్పుడు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెండితెరపై సాయిబాబాగా, కరుణామయుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్.. జగన్, వైఎస్సార్‌సీపీ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయన […]
ఓ వైపు సంచలన నిర్ణయాలతో పరిపాలన కొనసాగిస్తూనే.. మరోవైపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఇటీవల లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ పదవిని అప్పగించిన ఆయన.. ఇప్పుడు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెండితెరపై సాయిబాబాగా, కరుణామయుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్.. జగన్, వైఎస్సార్‌సీపీ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో, షర్మిల పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారంలో.. ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొని వైసీపీకి మద్దతుగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవిని విజయ్ చందర్‌కు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా ఈ పదవి కోసం అనేక మంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సినీ ప్రముఖులు పోసాని, మోహన్ బాబు, అలీ, జయసుధ ఈ పదవిని ఆశించిన వారి లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరందరిని పక్కనపెట్టి సీనియర్ విజయ్ చందర్‌కు ఆ పదవి ఇవ్వడంతో వారందరూ కాస్త నొచ్చుకుంటున్నారట. ముఖ్యంగా ఈ విషయంలో అలీ బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు టీడీపీకి మద్దతుగా ఉండే అలీ.. ఎన్నికల ముందు వైసీపీ కండువాను కప్పుకున్నాడు. ఇక వైసీపీలో చేరే సమయంలో ‘‘పార్టీ కోసం పనిచేయి.. నీ సంగతి నేను చూసుకుంటాను’’ అంటూ జగన్ హామీ ఇచ్చారని అలీ అప్పట్లోనే చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో తనకు బెస్ట్‌ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్ జనసేనను కాదని మరీ… అలీ, జగన్ చెంతకు చేరాడు. దీనిపై అప్పట్లో పవన్ బహిరంగంగానే కామెంట్లు వేశాడు. అలీ లాంటి వారి వలన మనుషులపై నమ్మకం పోతుదంటూ ఘాటుగా స్పందించారు. అయినా ఆ కామెంట్లకు ధీటుగా సమాధానం ఇచ్చిన అలీ.. ఎన్నికల ప్రచారంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశాడు. జగన్ తనకు ఏదైనా పదవి ఇస్తాడని భావించాడు. కానీ ఇప్పుడు ఈ పదవి కూడా రాకపోవడంతో ఆయన తన సన్నిహితుల దగ్గర తన బాధను వ్యక్తపరుస్తున్నాడట. టీటీడీ విషయంలో పక్కనపెడితే.. కనీసం ఈ పదవి కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. మరోవైపు ఈ పదవికి రాకపోవడంతో పోసాని, జయసుధ, మోహన్ బాబు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరందరిని జగన్ ఏ విధంగా కూల్ చేస్తారో చూడాలి.